రిటైర్మెంట్ తర్వాత సుఖంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే!
‘ఎన్నో పాత్రలను రసవంతంగా పోషించినా, రెండు పాత్రలకు న్యాయం చేయలేకపోయాను..’ రంగమార్తాండ సినిమాలోని డైలాగ్ ఇది. ఆ పాత్రల సంగతి సినిమా చూసి తెలుసుకోవచ్చు! కానీ, జీవన రంగస్థలంలోనూ ఎందరో ముఖ్యమైన రెండు పాత్రలకు న్యాయం చేయలేకపోతున్నారు. అందులో ఒకటి పదవీ విరమణ తర్వాత సాగించాల్సిన జీవనయానం. రెండోది మలిసంజెలో భావోద్వేగాలకు లొంగిపోవడం.